వాగ్దానము చేయబడిన పరిశుద్దాత్ముడు
నాలోనా నా పైనా ఉండిపోవాలి
1. బలముపై బలము నేను పొందాలి
శక్తిపై శక్తి నాలో రావాలి కొరతలేని
అభిషేకం నాపై ఉండాలి
కృపావరములు నాకు పంచి ఇవ్వాలి
2. పరలోక జీవము నాలో రావాలి
పరలోక వెలుగు నన్ను నింపాలి
పరలోక భాషలో మాట్లాడాలి
పరమతండ్రి మోము చూసి ఆనందించాలి
3. పరలోక దర్శనాలు నేను చూడాలి
పరమతండ్రి స్వరము నేను వినాలి
ఆత్మవరముతో నేను నింపబడాలి
ఆత్మబలము నాకు ఇవ్వబడాలి