అబ్బా నీ దివ్య పర్వతమునకు లేపుము
నన్ను యేసయ్యా ||2||
అబ్బా నీ ముఖం చూడాలి
అబ్బా నీ స్వరం వినాలి ||2||
అబ్బా నీ దర్శనం దొరకిన చాలు ||2||
మరణం గెలిచిన జగన్నాధుడా స్వాగతం
నీ పునరుత్థాన శక్తినివ్వగా స్వాగతం ||2|| ||అ||
1. మోషేను సీనాయి శిఖరముపై లేపి
పది ఆజ్ఞలు ఇచ్చి బలపరచితివి ||2||
అబ్బా ఈ పాప లోకంలో ||2||
నీ వాక్యమే నా త్రోవకు వెలుగు ||2||
జీవించిన మరణించిన నీతోనే ఉండాలి ||2||
జీవాహారం నిత్య వాక్కు స్వాగతం
నాలో నిరతం నివసింప స్వాగతం ||2||
2. ఏమి చెయ్యాలో దాన్ని చేయలేకున్నా
ఏం చేయ కూడదో దాన్నే చేస్తున్నా ||2||
అయ్యా పంపించు కృపనిచ్చు ఆత్మను||2||
నా తలంపులెల్ల నీవవ్వాలి ||2||
నీ చిత్తమే నాలో జరగాలి ||2||
ఆత్మ శరీరం నీకే సొంతం స్వాగతం
నా గాయాలన్నీ గుణపరచా స్వాగతం ||2||