అభిషేకం ఇది అభిషేకం
కన్నుల పండుగ అభిషేకం ||2||
అత్మతో జరిగే అభిషేకం ||2||
ప్రభువు సేవకు అభిషేకం ||2||
1. దేవుడే ఘనమని తలచిన వారికి
దేవుడే బలమని నమ్మిన వారికి ||2||
దేవుని యందున బ్రతికే వారికి ||2||
చల్లని వార్తను బోధించుటకు ||2|| ||అ||
2. పాపపు చెరలో చిక్కిన వారికి
వ్యాధిపీడత ప్రజలందరకూ ||2||
స్వేచ్చ స్వాంతన అందించుటకు ||2||
దేవుని ప్రజగా మలుచుట కొరకు ||అ||
3. మానవ జీవిత పరమార్థమును
కన్నుల ముందర నిలుపుటకోసం ||2||
దేవుని రక్షణ పొందే తరుణం ||2||
ప్రజలందరకూ ప్రకటించుటకు ||2||