సాకీ : అభిషేకం ఇది అభిషేకం
కాపరి సేవకు అభిషేకం
పావన ప్రభుని ప్రతిరూపం ||2||
ప| అభిషేకం ఇది అభిషేకం
కాపరి సేవకు అభిషేకం
పరిశుద్దాత్మతో అభిషేకం
పావన ప్రభుని ప్రతిరూపం ||2|| ||అభిషేకం||
1. క్రీస్తు మందను కాయుటకు
సత్యపు బాటన నడుపుటకు
విశ్వాసానికి నిలువుటద్దమై ||2||
అండగా మాకిక నిలుచుటకు ||2|| ||అభిషేకం||
2. దేవుని వాక్కు అందించుటకు
బలి అర్పణలు చేయుటకు
సంస్కారాలు జరిపించుటకు ||2||
భక్తుల పవిత్ర పరుచుటకు ||2|| ||అభిషేకం||
3. మోషేలాగా చేతులు ఎత్తి
పాపుల కోసం ప్రార్థన చేసి
పవిత్రమౌ నీ కరములు చాపి ||2||
ప్రజలందరిని దీవించుటకు ||2|| ||అభిషేకం|| \