సాకీ :స్వాగతం .... స్వాగతం....
ఆత్మదేవా.... సుస్వాగతం....
ఆ......ఆ......ఆ...... ఉ......ఉ......ఉ.......
అతిరథ మహా పురుషుండదిగో
అవనిలో మనకై అరుదెంచినాడు
మానవ పాప ప్రక్షాళనకై
శాంతి శుభములు స్థాపనకై ||2||
పరిశుద్ధ దేవా .... కరుణించగరావా
త్రియేక క్రీస్తువా ..... ప్రేమతో దయచూపవా
1 వ చరణం..
ఈ బలిపూజకు మముపిలిచిన ఆత్మదేవా
మీ జ్ఞానవరములతో మమునింపగ రావా ||2||
మీ ఆత్మశక్తితో దీవించగ రావా
మా జీవితాలను వెలిగించు దేవా ||2||
2 వ చరణం..
భువికేతెంచిన దావీదు సింహమా
లోక లోకాల పాలించు రాజ మందసమా ||2||
యుగ యుగములకు యాజక నక్షత్రమా
తరతరములను దీవించరావా ||2||
స్వాగతం మరియ తనయా స్వాగతం
కరుణ హృదయా స్వాగతం.....
స్వాగతం..... స్వాగతం ప్రభువా