అద్వితీయుడా అభిషిక్తుడా
నన్ను నిరతము కాపాడే నా ఏసయ్య
నీ రక్తముతో నన్ను కడిగి-ఆత్మీయ
వరములతో నన్ను నింపుమయా ||అ||
1. సృష్టిలో అతిమధురం తల్లిదండ్రుల ప్రేమ
ఆ ప్రేమ కన్న మిన్న అయినది నీ ప్రేమ
ఎందుకయ్యా గొప్పదేవుడా నాపై ఇంతజాలీ||2||
అవధులు లేని నీప్రేమ నన్నబ్బురపరచెనయా ||అ||
2. ప్రార్థించగనే బదులు పలికెడి సమాధానకర్త
కష్టాలలో మమ్మాదుకొనెడి కారుణ్యమూర్తి
వేదనలో నాహృదయాన్ని ఓదార్చుదేవు ||2||
ఎలా తీర్చను నీ ఋణము ఓ దీనబాంధవా ||అ||