Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడా
యాకోబు దేవుడా మాకు చాలిన దేవుడా
సైన్యములకు ప్రభువా ఆరాధింతుము నీ నామం ||6||
1. సాతాన్ను ఓడించి లోకాన్ని జయించి
మరణాన్ని దూరం చేసినా ఉత్థానుడైన యేసయ్యా
సైన్యములకు ప్రభువా ఆరాధింతుము నీ నామం ||2|| (అబ్ర)
2. పాపులకు పరిహారం దుఃఖితులకు ఓదార్పు
రోగులకు స్వస్థత నిచ్చే లోక రక్షక యేసయ్యా
సైన్యములకు ప్రభువా ఆరాధింతుము నీ నామం ||2|| (అబ్ర)
3. గ్రుడ్డివారికి చూపును చెవిటి వారికి వినికిడిని
బంధితులకు విడుదలను స్వస్థత నిచ్చిన యేసయ్యా
సైన్యములకు ప్రభువా ఆరాధింతుము నీ నామం ||2|| (అబ్ర)