Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అల్లెలూయా....అల్లెలూయా....అల్లెలూయా....
నీ మాటలో శక్తి ఉన్నది
నీ బాటలో ముక్తి ఉన్నది
నీ చూపులో కరుణ ఉన్నది
నీ శ్వాసలో జీవమున్నది
యేసయ్యా యేసయ్యా స్తోత్రం చెల్లింతు
యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా మీకే స్తోత్రం
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
ఆ........ఆ...........
1 వ చరణం..
నజరేతులో జీవించితివి దైవ వాక్కు ప్రేమను
ప్రకటించితివి దీన బంధువై ఓ దార్చితివి
దైవ రాజ్య స్థాపన గావించితివి... యేసయ్యా
2 వ చరణం..
కుంటివారిని నడిపించితివి పాపి మగ్ధలీనను
క్షమించితివి వ్యాధి భాధలు తొలగించితివి
ఎల్ల జనులకు రాజువైతివి..... యేసయ్యా
3 వ చరణం..
సిలువ యాగము అర్పించితివి సత్యమార్గమున
నడిపించితివి ఆత్మ వర్షము కురిపించితివి
ఆత్మ దాహమై ప్రార్థించితివి ..... యేసయ్యా