Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. అంజూరపు చెట్టొకటి
నాటెను ద్రాక్షవనమందు
పూతరాది పిందె లేదే ||2||
పచ్చని ఆకులతో నిండె ||2||
1. యజమాని దేవుడు మూడేళ్ళు వెదకినా
కనపడలేదు ఒక ఫలమైన
ఈ భూమిపైన వ్యర్ధమని వెదకినా
నరికించమనెను ఆ చెట్టును
2. తోటమాలి యేసు అమితమైన ప్రేమతోడ
అడిగెను గడువు ఒక వత్సరము
పాదులు త్రవ్వి రాళ్ళను ఏరి ఫలియించుటకు
బహు శ్రమపడెను ||2||
3. ఆయన రక్తములో ప్రతి తీగెను తడిపి
వేసెను కంచే పరిశుద్ధాత్మతో ||2||
తోటలోనికి శత్రువు రాకుండ
కాచె యేసు నిధుర మాని ||అ||