ప. అల్లెలూయ అల్లెలూయ
అల్లెలూయ అల్లెలూయ
నిరతము నీతోనుందుము యేసయ్యా ||2||
నిత్యజీవ పలుకులు గల యేసయ్యా ||2||
1. ధర్మ శాస్త్ర బోధనలు,
దివ్య గ్రంధ సూక్తులయ
ధర్మమెంతో చాటునులే-
ధన్యతను చూపునులె ||2||
పరమ వరము లిచ్చునులే
పాపమెల్ల త్రుంచునులే ||2||
కరుణనెంతో చూపునులే
కలతలెల్ల బాపునులే ||నీర||
2. రెండంచుల ఖడ్గము వలె
దివ్య వాక్కులుండెనయ
ఖండించె శక్తితోను -
దివ్య మాటలున్నవయ ||2||
అద్దమువలె పనిచేయుచు
సరిదిద్దును మన తప్పులు ||2||
శుద్దముగా స్వీకరించు నీలోనికి ప్రభువాక్యం ||నీర||