ప: హల్లెలూయ - హల్లెలూయ ||4||
యేసుని మాట-జీవపు ఊట
రక్షణ పాట-మోక్షపుబాట ||2|| ||హ||
1. ఒలికెను క్రీస్తుని రుధిరం
దొరికెను పాపికి తరుణం
తొలగెను రెండవ మరణం
మురిసెను మానవ హృదయం
2. నిలిచింది నా నాధుని మాట
గెలిచింది సమాధి దాక
మెరిసింది ఆ ప్రాంత తోట
ఒరిగింది సాతాను కోట