Lyrics: unknown
Tune: unknown
Music: Dr. PJD Kumar
Album: లాలనుచు పాదరే-4
అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయా అల్లెలూయా
మార్గము సత్యము జీవము నీవై వెలసిన యేసయ్య కరుణా సహనము శాంతియు నీలో దొరుకును
మెస్సయ్య ఇమ్మానుయేలువై ఇహమేలు రాజువై మా మంచి కాపరివై మహిలోన పుట్టితివి అల్లెలూయ ||4||
1. భాగ్యవంతుడవై యుండి బంధీలను విడిపించుటకు బంగారు పురమును వీడి బాలునిగ అవతరించితివి (పసిబాలునిగ.)
సంతోషగానాలతో ఉల్లాస గీతాలతో జోలాలి పాటలతో నిన్ను ప్రణమిల్లి ప్రణుతించెదం అల్లె... ||4||
2. తండ్రితో ఐక్యపరచుటకు తనయునిగా రూపుదాల్చితివి తగ్గింపు ప్రార్థన నేర్పుటకై పశుశాలనే నీవు యెంచితివి సంతోషగానాలతో ||4||