పల్లవి
అమర జ్యోతి ఇల వెలిగింది
నిఖిల జగతి పులకించింది
స్వర్గ సిరులతో ప్రేమ సుధలతో ||2||
పుడమి నేడు పునీతమైంది
ఇదే క్రీస్తు జయంతి ఇదే ప్రేమ ప్రవంతి
ఇదే క్రీస్తు జయంతి ప్రేమ స్రవంతి ||అ||
1 వ చరణం..
చీకటి కమ్మిన పేద లోగిలిలో
ఉషాకాంతిలా ప్రభవించాడు
శోకం నిండిన ఎద ముంగిలిలో ||2||
నవ వసంతమై అరుదెంచాడు ||2||
ఇదే క్రీస్తు జయంతి ఇదే ప్రేమ స్రవంతి
ఇదే క్రీస్తు జయంతి ప్రేమ స్రవంతి ||అ||