అంబరాన్ని తాకే సంబరాలకు రారండి రారండి
క్రీస్తు జయంతి వేడుకలకు రారండి
ఆనంద దీపాల తోరణాలతో
తోరణాలు తోరణాలు ఆనంద దీపాల తోరణాలు
నిష్కళంక హృదయాల హారతులతో
హారతులు హారతులు నిష్కళంక హృదయాల హారతులు
కన్య మరియ తనయునకు స్వాగతం పలుకుదాం
సంగీత ధ్వనులతో స్తుతి గీతం పాడుదాం
ఓ యెహెూవా జనమా ఓ... యేసయ్య సంఘమా
1 వ చరణం..
పాపులను వెదకి వెదకి రక్షించాలని
దీనులను ఆదరించి దరికి చేర్చాలని
లోకమె యివ్వలేని శాంతి నివ్వాలని
లోకాన్ని జయించుటకు శక్తినివ్వాలని
తండ్రి దేవుడె పంపిన ఏకైక పుత్రుడు
కన్య మరియ గర్భాన ఉదయించిన సూర్యుడు
స్వాగతం స్వాగతం స్వాగతం స్వాగతం
కన్య మరియ తనయుడా నీకే స్వాగతం
మా హృదయాల పూలమాల నీకే అంకితం
2 వ చరణం..
పేదలకు శుభవార్తను బోధించాలని
చెరనున్న వారికి స్వేచ్ఛనివ్వాలని
అంధులకు చూపును కలిగించాలని
పీడితులకు విమోచనం కలుగజేయాలని
తండ్రి దేవుడే పంపిన ప్రియమైన పుత్రడు
రక్షణ ద్వారం తెరచిన కరుణామయుడు