ఈ ఘడియ కోసమె జగతి వేచింది
ఈ ఘనుడి కోసమే జనులు చూచింది
నీ మహిమ కీర్తనం దూతలు పాడింది
నీ ముంగిట ప్రణమిల్లి జ్ఞానులు వేడింది
ఇది క్రిస్మస్ గీతం క్రీస్తు రాకను సంకేతం
హేపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ ||2||
1 వ చరణం..
ఆ నింగి నీకు సింహాసనమైన ` ఈ నేల నీకు పాద పీఠమైనా
నీ జననం ఓ పేద వాకిటనే
నీ గమనం నిరుపేద గుండెలోనే ||ఇది||
2 వ చరణం..
కొమ్మలు రెమ్మలు జోలపాడాయి -
పశువులు పక్షులు తలలూచి వేడాయి ||2||
నినుకన్న ఆ కన్నె పొత్తిళ్ళు నిండాయి ||2||
నినుగన్న మనుజుల కన్నులు పండాయి ||ఇది||
3 వ చరణం..
అలలపై నడచిన ఈ చిన్ని పాదం -
మా తలలు తాకిన మాకెంతో ఆనందం ||2||
గాలినే గద్ధించు నీ దైవవాక్కు ||2||
మా గాయాలు బ్రతుకులకు నిత్య ఓదార్పు ||ఇది||