ఉదయించే ఒక తార నీలాల నింగిలో
జన్మించే రారాజు పశువుల పాకలో
ఆనంద భావాలు సుమరాగ మాలతో
మనసార చాటెదం క్రీస్తుని జననం
Happy Happy Christmas
We Wish you
Merry Christmas
1 వ చరణం..
అలసి సొలసిన వారికి నేడు
విశ్రాంతి నియ్యగా
ఆది మానవ పాపము బాపి
అమరుని చేయగా ||2||
శాంతి జల్లులను కురిపించ నేడు
శాంతి పావురమై జనియించే ఈనాడు ||2||
2 వ చరణం..
అంధకారపు జీవితాలలో
వెలుగును కురిపించ
వ్యాధి బాధలు తొలగించ
ఉదయించే రక్షకుడు ||2||
చీకటి ఛాయలను ఛేదించ నేడు
బాల భానుడై జనియించే ఈనాడు ||2||