Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. అమ్మా... మరియమ్మ..
ప్రణుతించెదమూ... రక్షకమాత...
నినినిస...గారని.. నినిసాస..
గాగ నిని. ఆ..ఆ.. ||2||
అమ్మా అమ్మా మా మరియమ్మ
వందనమమ్మ ప్రీతితోగొనుమ
జీవ ప్రదాత యేసునాధునికి
జన్మనిచ్చిన మాత
జీవమార్గమున నిత్యము నడువగా
మాకై వేడగరమ్మా ||అ||
1. ఆది దేవుని తలపుల వరమున
పూచిన పరిమళ పుత్రిక వరమా ||2||
ఆపదలందున ఆలంబనవై
రయమున రావా దీవెనలిడవా
నిత్యసహాయి ||జీ||
2. ప్రేమాధరముల నిలయమునీవే
ప్రేమస్వరూపుని మోసినతల్లి
పరమును ఇహమున చేర్చిన మాత
ప్రణుతించెదము దీవెనలిడవా
శ్రీసభమాత ||జీ||