Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అమ్మా అమ్మా మా మరియమ్మ
వందనమమ్మా ప్రీతితో గొనుమా అమ్మా.,,,,,
జీవప్రదాత యేసునాధునికి
జన్మనిచ్చిన మాతా
జీవమార్గమున నిత్యము
నడవగా మాకై వేడగరమ్మా
1 వ చరణం..
ఆదిదేవుని తలపుల వనమున
పూచిన పరిమళ పుత్రికవరమా
ఆపదలందున ఆలంబనవై 2
రయమునరావా దీవేనలిడవా నిత్యసహాయిని
2 వ చరణం..
ప్రేమాధరముల నిలయము నీవే
ప్రేమస్వరూపుని మోసిన తల్లి
పరమును ఇహమున చేర్చిన మాతా
ప్రణతించెదము దీవెనలిడవా శ్రీసభమాతా