Lyrics: Fr. Johnson Chettur
Tune: Rev. Bishop Poola Anthony
Music: Thyagarajan
Album: స్వరాభిషేకం
ప. అమ్మా... అమ్మా... అమ్మా...
మా మేరి మాత అమ్మా...... అమ్మా........
ఓ లూర్థుమాత యేసుక్రీస్తు జనని
కరుణామృత వర్షిణి దైవకృప తరంగిణి
మా జీవన వాహిని
పరమ పునీతం నీ జీవితం
మమతల మధువనం
నీ మానసం ||2|| ||యే||
1. నీపాద ధూళితో లూర్థు పరవశించేను
చల్లని నీ చూపుతో
పునీత మాయెను బెర్నదత్ ||2||
నీ కనుపాపలుగా ఈదీనులనాదరించు
నీ ఒడిలో పాపలుగా నిదురించే వరమివ్వు||2||
2. పరిశుద్ధాత్మతో యేసుతల్లివైనావు
మా కనురెప్పల పందిరిలో కొలువుతీరినావు||2||
మనసారా వేడగా పాపుల కరుణించేవు
గళమెత్తి పాడగా పులకించేవు తల్లి ||2|| ||యే||