Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: యేసుని చూడాలని
ప: అబ్బా దైవమా నీవే జీవము -
ఆశా దీపమా నీవే అభయము
నీ దివ్య రాజ్యం భువియందు రావాలి -
నీ చిత్తం భువియందు జరగాలి
దివి భువి పాడాలి నీ దివ్య గీతం -
భువి యందు స్వర్గరాజ్యం రావాలి
అనుదినం దివ్యాహారం ప్రతిరోజు -
మాకివ్వండి తండ్రివైన దైవమా ||2||
1.స్వర్గరాజ్య సియోనులో
దేవదూతలతోను కీర్తించు ప్రభుని
భువియందు మానవులంతా హల్లెలూయ -
గీతంతో పూజింతు ప్రభుని ||2||
నీ దివ్య రాజ్యం భువియందు రావాలి....
2. భారం మోసే వారికి అలసిసొలసిన
వారికి అభయం నీవేగా
నిరీక్షించే వారికి నిత్య రక్షణ
నొసగు ప్రభువు నీవేగా ||2||
నీ దివ్య రాజ్యం భువియందు రావాలి