Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అమ్మా అమ్మా మాత మీ ప్రియ పుత్రుని
ఆత్మయందు సత్యమందు ఆరాధిస్తున్నాం.
1. అమ్మా అమ్మా మాత ఆహారం లేకున్నప్పుడు
అప్పరూపం దాల్చిన యేసుని ఆరాధిస్తున్నాం.
2. అమ్మా అమ్మా మాత మనస్సులో భారం నిండగ
ముళ్ళ మకుటం ధరించిన యేసుని ఆరాధిస్తున్నాం.
3. అమ్మా అమ్మా మాత అలసిసొలసిన సమయంలో
శక్తినొసగు యేసుని మేము ఆరాధిస్తున్నాం.
4. అమ్మా అమ్మా మాత నిందలపాలగునపుడు
నిందించబడిన నిష్కలంకుని మేము ఆరాధిస్తున్నాం.
5.. అమ్మా అమ్మా మాత కన్నీటి సంద్రంలో ఉండగ
సంద్రంపై నడచిన యేసుని మేము ఆరాధిస్తున్నాం.
6. అమ్మా అమ్మా మాత వ్యాధిబాధలు ఉన్నప్పుడు
స్వస్థపరచిన యేసుని మేము ఆరాధిస్తున్నాం
7. అమ్మా అమ్మా మాత నిద్రభారం పెరుగగ.
రాత్రిలో పాలించిన యేసుని ఆరాధిస్తున్నాం