Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో
అవతార మూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్
ఆనంద నంద ఉప్పొంగే నాలో అమర కాంతిలో
ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని || అందాల || |
1 ప్రభు జన్మ స్థలము పాకయేగాని పరలోక సౌధమే
వింతైన కాంతి హర్షించే నాలో విజయ పథమున
విశ్వాలనేలేడి దైవ కుమారుడు వీక్షించే దీక్షతో
విరజిమ్మె ఫలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచూ || అందాల || |