Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప|| అందాల తార వెలసిన వేళ
ఆకాశం ప్రకాశించువేళ
దూతలు గానాలు పాడినవేళ -
ధరలో క్రీస్తు ఉదయించువేళ
ఆనంద జ్యోతులు వెలిగిన వేళ -
ఆత్మాంధకారం చీల్చిన వేళ
క్రిస్మస్ పండుగ ఈ వేళ -
మనుజాళి రక్షణ ఈ వేళ ||2||
రండి రారండి రారాజును పూజించరండి ||2||
రండి రారండి బాలయేసును స్తుతియించ రండి
||అందాల తార||
పపదని పపదని పపదనిస
మమపద మమపద మమగరిగ -
సరిగమప నిసరిమద
1. ఆదాము పాపము బాప -
అరుదెంచెను శ్రీక్రీస్తువు
ఆబేలు సౌభాగ్యమొసగ -
దీవించును శ్రీయేసువు
శాంతిజల్లు కురిపించె నేడు -
శాశ్వత జీవం అర్పించె నేడు ||2||
దైవజనమా దర్శింపరారే -
దైవ కుమారుని దరిచేర రారే ||2||
||రండి రారండి|| ||అందాల తార||
2. నూతన జగతిని నిర్మింప -
ఏతెంచెను ఆ నజరేయుడు
మరియ గర్భఫలమందె -
జన్మించెను ఆ బాలుడు
దైవరాజ్యం స్థాపించె నేడు -
ధన్యులుగా దృఢపరచె నేడు ||2||
దైవజనమా దర్శింపరారే -
దైవ కుమారుని దరిచేర రారే ||2||
||రండి రారండి|| ||అందాల తార||