Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. అందమైన క్రిస్మస్
ఆనందమైన క్రిస్మస్
రమ్యమైన క్రిస్మస్
మన ధన్యమైన క్రిస్మస్
గ్లోరియా గ్లోరియా గ్లోరియా గ్లోరియా
1. బెత్లహేములో ప్రభువు పుట్టిన
పవిత్ర దినమే ఈ క్రిస్మస్
ఆకాశాన తార వెలసిన
పర్వదినంబె ఈ క్రిస్మస్
గొల్లలు జ్ఞానులు అర్పణలిచ్చిన
పావన దినమే క్రిస్మస్ వచ్చింది
వచ్చింది వరాల క్రిస్మస్ వచ్చింది.
తెచ్చింది తెచ్చింది భువికి రక్షణ తెచ్చింది ||గ్లో||
2. దూతగణములు భువికి వచ్చిన
దివ్య దినంబె ఈ క్రిస్మస్
భువికి శాంతిని కలుగ జేసిన
ఘనమగు దినమే ఈ క్రిస్మస్
పరమును మహిమతో నింపగలిగిన
ప్రభు దినంబె క్రిస్మస్ వచ్చింది,
వచ్చింది వరాల క్రిస్మస్ వచ్చింది.
తెచ్చింది తెచ్చింది భువికి రక్షణ తెచ్చింది ||గ్లో||
3. మనమెల్లరము అర్పణ చేయు
క్రీస్తు పూజయే ఈ క్రిస్మస్
అనుదినము ఆరాధన యందు
కొనియాడెదము ఈ క్రిస్మస్
రాజుల రాజుకు క్రీస్తుయని పాడే
పవిత్ర సమయమే క్రిస్మస్ వచ్చింది
వచ్చింది వరాల క్రిస్మస్ వచ్చింది
తెచ్చింది తెచ్చింది భువికి రక్షణ తెచ్చింది ||గ్లో||