Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అత్యున్నతములో మహిమ పాడి
దూతల బృందం ఏతెంచిరి
భూలోకవాసులకు శాంతినివగ
దేవాదిదేవుడు ఉదయించెను ||అ||
1 వ చరణం..
గొల్లలు జ్ఞానులు ఏతెంచిరి
బంగరు బోళములు అర్పించిరి
పాడిరి దూతలు మహిమగీతం
పావన యేసుకు భక్తితోడ ||అ||
2 వ చరణం..
పాపుల రక్షింప ఏతెంచెను
పాపము బాపగ ఉదయించెను
గ్లోరియ పాడెద ఏసునకు
కావగరావా ముద్దులబాలా ||అ||