Type Here to Get Search Results !

అత్యంత రమణీయ ( athyantha ramaniya Song Lyrics in Telugu | Telugu Christian song lyrics website )

 Lyrics: Y Prabhakar Reddy 

Music/Tune: Kiran B, Praneeth D 

Album: లాలనచుపాడరే - 2 


ప. అత్యంత రమణీయ 

అమర పురము వీడి 

అవనికి అరుదెంచితివా - దేవా ||2|| 

అల్పులము అయిన మాపై 

నీ ప్రేమ నిలుప ||2|| 

సంకల్పించితివా తండ్రి బ్రోవ ||2|| ||అ|| 


1. ఆదాము పాపము హరియింపగ

నిర్మల గర్భము సృజియించినా 

రక్షణ కాలము అరుదెంచుగా 

కన్యకు శిశువుగ జన్మించితివా 

భక్తుల మొక్కులు నెరవేర్పగ నీవు

బెత్లహేములో ఉదయించినావా ||2|| 

ఘనతమహిమ స్తుతులు అనుచు

దూత గణములు కీర్తనలు పాడగ ||అ|| 


2. చీకటిలో చిరుదీపం వెలిగించగ

వేదనలో ఉపశమనం కలిగించగ 

సాతాను దాస్యంబు తొలగించగా 

శాంతి సందేశం వినిపించగా 

ధర పైన ప్రభురాజ్యం స్థాపించనెంచి 

నరరూప ధారుడవై జనియించినావా ||2|| 

రాజుల రారాజు ప్రభవించినాడనుచు 

గొల్లలు జ్ఞానులు దర్శించరాగ ||అ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section