Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. అందమైన మందసమున
పొందుగ పొంచున్న ప్రభువా ||2||
అందుకొనుమో మాదుయెదల
అంధులవ్వక ముందే దేవా ||అ||
1. అనుదినమును దివ్య బలిలో
అవతరించే మహాదేవా
కనుమా మమ్ము కనికరముతో
కన్నులారా నిన్ను గాంచ
తనువు మనసు నీదేనయ్య
రమ్ము మాకు జీవమియ్య ||2||
కనుదమయ్య మిమ్ము మేము
సత్ప్రసాదరూపాన ||అ||
2. కరుణామయ కనికరించు
తరచుగాను మాలోని కొస్తు
మరువము నీదు మేలునెపుడు
`మరియ తనయ మాదు ప్రభు
అప్పరసపు రూపంబులో
దర్శనమిచ్చి బ్రోచేదేవా ' ||2||
తప్పులన్ని బాపె. ప్రభువా
రక్షణ దాతవు గావా ||అ||
3. నాదు దేహం మీదు భోజ్యం
అని పలికిన పరమనాధ
నారుధిరంబె మీదు పానం
అని పలికిన క్రీస్తునాధ ||2||
రమ్ము మాదు హృదయంబులన్
తరియింపగాను చేయునాధ ||2||
పొమ్మని మాతో తనకు దేవా
పాపులను రక్షించు నాధ ||అ||