Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అర్పణం - హృదయార్పణం
అర్పణం - స్నేహార్పణం ||2||
ఈ దీన హృదిని ప్రేమతో చేకొని ||2||
దీవించు దేవా - ఈ దివ్యబలిలో ||2|| ||అర్పణం||
1. ఆబేలుని బలి - చేకొను రీతిగా
మా కానుకలను - గైకొను దేవా ||2||
ఓ యేసు దేవా - నా జీవ నాధా ||2||
నాకున్న సకలం- నీ దానమేగా ||2|| ||అర్పణం||
2. మా కష్ట ఫలమే - ఈ అప్పరసము
ప్రేమతో చేకొని - ఆశీర్వదించు ||2||
ఓ యేసు దేవా - నా ప్రాణ నాధా ||2||
నాకున్న సర్వం - నీ వరమేగా ||2|| ||అర్పణం||