Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అర్పణం - హృదయార్పణం
అంకితం ఈ జీవితం ||2||
దేవా దేవా నీ కర్పితం-నా సర్వస్వం ||2||
నీ దివ్య సన్నిధి నిలబడి
నీ పాద పీఠిని తలనిడి ||2||
అర్పించేను అంజలిమాల
నిను కొలిచేను ఈ శుభవేళ ||2|| ||అర్పణ||
1. (నా)జీవన గీతికి మాధురి నీవే
చల్లని పిలుపుతో స్పందించినావే
కృపారసముతో పోషించినావు
జీవన ద్యుతికి గమ్యము నీవు ||2||
|||నీ దివ్య సన్నిధి నిలబడి|| ||అర్పణ||
2. ఈ జగమంతా నీదే దేవా
సిరి సంపదలు నీకే సొంతం ||2||
పంచ భూతములు రేయీపవళూ
పరవశమొంది నీ స్తుతి పాడె ||2||
|||నీ దివ్య సన్నిధి నిలబడి|| ||అర్పణ||