Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
అతిపూజ్యుడౌ దేవుడెప్పుడు
||స్తుతింపబడును గాక ||
మాధుర్యము గల వారి నామము
||స్తుతింపబడును గాక ||
నిజదేవ మానవుడైన యేసు
||స్తుతింపబడును గాక ||
పావనమైన వారి నామము
||స్తుతింపబడును గాక ||
యేసువు యొక్క దివ్యహృదయము
||స్తుతింపబడును గాక ||
యేసునాధుని పవిత్రరక్తము
||స్తుతింపబడును గాక ||
పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందును వేంచేసి యుండు యేసునాధుడు
||స్తుతింపబడును గాక ||
ఓదార్చువారైన పవిత్రాత్మ
||స్తుతింపబడును గాక ||
దేవునితల్లి మరియమాత
||స్తుతింపబడును గాక ||
మేరిమాత యొక్క అమలోద్భవం
||స్తుతింపబడును గాక ||
కన్యతల్లియగు వారి నామము
||స్తుతింపబడును గాక ||
ఆమె యొక్క మోక్షారోపణము
||స్తుతింపబడును గాక ||
మరియ భర్త యేసేపు
||స్తుతింపబడును గాక ||
తమ దూతలయందు తమ అర్చ్వశిష్ఠులయందును దేవుడెప్పుడు
ఘనముగా - ||స్తుతింపబడును గాక ||