Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. అయ్యో-అయ్యో-ఎంత ఘోరమూ
అయ్యో- అయ్యయ్యో-ఎంత దారుణం
అయ్యో అయ్యో - ఎంత ఘోరము–అయ్యో
అయ్యయ్యో - ఎంత దారుణం
ప్రేమకు ప్రతి ఫలమా-ఈ సిలువ శిక్ష
కరుణకు బహుమానమా.
ఈ కఠిన పరీక్షా అయ్యో..... యేసయ్య
1. మన పాపం, మన శాపం
సిలువ మ్రానుగామారే
అపరాధం, అపవాదం
మరణ తీర్పునే కోరే ||2||
న్యాయమా, ఇది ధర్మమా
నీతికే, విద్రోహమా
మమతకే, ఈ శోకమా
ప్రేమకే అపకారమా
ప్రేమకు ప్రతిఫలమా
ఈ సిలువ శిక్షా
కరుణకు బహుమానమా
ఈ కఠిన పరీక్షా ||అ||
2. స్వార్ధం, మోసం, క్రోధం
ముళ్ల మకుటమాయెనే
దుర్నీతి, దౌర్జన్యం
ఇనుప మేకులైపోయె ||2||
ప్రేమయే, నీ నేరమా
సేవయే అపరాధమా
శాంతికే... సంక్షోభమా
మన్ననే, మాలిన్యమా ||అ||