Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయ నీ కృపలో
నపరాధములను క్షమించు ||అ||
1. సిలువకు నిను గొట్టితిని -
తులువలతో చేరితిని
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా ||అ||
2. ప్రక్కలో బల్లెపు పోటు
గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితివయ్యా ||అ||
3. ముళ్లతో కిరీటంబు
అల్లి నీ శిరమున నిడితి
నా వల్లనే నేరమాయే
చల్లని దయగల తండ్రి ||అ||
4. దాహంబు గొనగా చేదు
చిరకను ద్రావనిడితి
ద్రోహుండనై జేసితిని
దేహంబు గాయంబులను ||అ||
5. ఘోరంబుగా దూరితిని
నేరంబులను చేసితిని
క్రూరండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా ||అ||
6. చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత
నిందలు పెట్టి తినయ్యో
సందేహమేలనయ్యా ||అ||
7. శిక్షకు పాత్రుడనయ్యా
రక్షణ తెచ్చితివయ్యా
అక్షయ భాగ్యము నియ్య
మోక్షంబు జూపితివయ్యా ||అ||