Type Here to Get Search Results !

అదే అదే ఆ రోజు ( adhe adhe aa roju Song Lyrics in Telugu | Telugu Christian song lyrics website )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: అదే అదే ఆ రోజు ఏసయ్యా ఉగ్రత రోజు

ఏడేండ్ల శ్రమల రోజు పాపులంత ఏడ్చేరోజు 


1. వడగండ్లు కురిసే రోజు - భూమి సగం కాలే రోజు

నక్షత్రముల్ రాలే రోజు - నీరు చేదు అయ్యే రోజు

ఆ నీరు సేవించే మనుషులంతా చచ్చే రోజు


2. సూర్యుడు నలుపయ్యేరోజు - చంద్రుడు ఎరుపయ్యే రోజు

భూకంపం కలిగే రోజు - దిక్కులేక అరచే రోజు

ఆరోజు శ్రమనుండి తప్పించే నాధుడు లేడు


3. మిడుతల దండొచ్చే రోజు - నీరు రక్తమయ్యే రోజు

అబద్దికులు అరచేరోజు - దొంగలంత దొర్లే రోజు 

ఆరోజు శ్రమనుండి తప్పించే నాధుడు లేడు ||అదే|| 


4. వ్యభిచారులు ఏడ్చేరోజు - మోసగాళ్ళ మసలేరోజు

క్రోధాగ్ని రగిలే రోజు పర్వతములు పగిలే రోజు

ఆరోజు శ్రమనుండి తప్పించే నాధుడు లేడు


5. పిల్లజాడ తల్లికి లేక - తల్లి జాడ పిల్లకు కాక

చెట్టు కొకరు పుట్టకొకరై అనాధులై అరచే రోజు

ఆరోజు శ్రమనుండి తప్పించే నాధుడు లేడు


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section