Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. అదిగదిగో అల్లదిగో కల్వరి
మెట్లకు దారదిగో
ఆ ప్రభువును వేసిన సిలువదిగో ||అ||
1. గెత్సెమను ఒక తోటదిగో
ఆ తోటలో ప్రార్ధన స్థలమదిగో ||2||
ఇచ్చటనే యుండి ప్రార్ధించుడని ||2||
పలికిన క్రీస్తు మాటదిగో ||అ||
2. శిష్యులలో యిస్కారియోతు
యూదాయను ఒక ఘాతకుడు ||2||
ప్రభువును యూదుల కప్పగింప ||2||
పెట్టిన దొంగ ముద్రదిగో ||అ||
3. లేఖనము నెరవేరుటకై
ఈ లోకపు పాపము పోవుటకై ||2||
పావనుడేసుని రక్తమునూ గల ||2||
ముప్పది రూకల మూటదిగో ||అ||