Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. అడుగడుగున రక్త బిందువులే
అణువణువున కొరడా దెబ్బలే
నా యేసుకి ముండ్ల కిరీటం
భుజములపై సిలువ భారం
1. సిలువ మోయుచు వీదులవెంట
రక్తధారలే నన్ను తడిపెను
నా ప్రజలారా ఏడువకండి
మీ కోసమే ప్రార్ధించండి ||అ||
2. కలువరిలోనా నీ రూపమే
నలిగి పోయెను నా యేసయ్యా
చివరి రక్త బిందువు లేకుండా
నా కోసమే కార్చినావా||అ|| 3 మరణము గెలిచి తిరిగి లేచిన
మృత్యుంజయుడా నీకే స్తోత్రం ||2||
మహిమ స్వరూపా నా యేసయ్యా
మహిమగాను నన్ను కాచినావా ||2|| llఅడుగడుll