పోదాము పోదాము బెత్లహేము మనము
పోదాము పోదాము దావీదు పురము
పశువుల కొట్టంలోన పొత్తిగుడ్డలలోన
చుట్టబడి ఉన్నాడట ముద్దులొలికే బాలుడట
అతడే అతడే లోక రకక్షకుడంట
అతడే అతడే మన రక్షకుడంట
1 వ చరణం..
దిట్టమైన పొట్టేళ్ళను భుజముకెత్తు
ఎర్ర తెల్ల మేకపిల్లల చంకన పెట్టు
మేలైన జీవులను కానుకగా చేద్దామా ||2||
బాల ప్రభువుని వరాలెన్నో
అందుకుందామా ||అ||
2 వ చరణం..
ధర్మ ప్రభువు పుట్టంగా స్థలములేదా
పశుల ఘాల పరచంగా బొంతలు లేవ ||2||
మన గొంగళి దుప్పటితో
బాలుడిని కప్పుదామా ||2||
బాల ప్రభువుని వరాలెన్నో
అందుకొందామా ||అ||