పల్లవి
పుడవి శాపమును తొలగించే విభుడు
పశుల పాకలో పవళించే నేడు ||2||
బాధామయ సేవకుడు
బంధీల విమోచకుడు
తిమిరాలను తొలగించే
తేజోమయ రక్షకుడు
ప్రణుతించగరారే
ప్రభువును పూజింపరే
హారతులర్పించరే - ఆత్మార్పణ చేయరే
1 వ చరణం..
శాంతిని స్థాపించే - శాంతి ధాముడు
ప్రేమామృతము పంచే
అనురాగ హృదయుడు
యుగయుగాల ప్రవక్తల
ప్రవచనాలు ఫలించగా
అవతరించిన సుతుడు
ఇమ్మానుయేలుడు ||ప్ర||
2 వ చరణం..
పేదల పాలిటి ప్రేమ స్వరూపుడు
పీడితుల కాపాడే పాపవిమోచకుడు
దీన జనుల కాపాడు ధరణినేలు రారాజు
మన మధ్య జన్మించిన
మనుష్యావతారుడు ||ప్ర||