పల్లవి
పండంటి పాపడమ్మా మనకై పుట్టినాడు
పశులపాకలో బెల్లేముపురములో
పండుగ పూలు పూయాలమ్మా
ప్రతి గుండెలో
నిండుగ ఆడి పాడాలమ్మ
ఊరు వాడలూ
1 వ చరణం..
చల్లని పూటా మెల్లని మాట వినగానే
కల్లలు లేని గొల్లలు వేవేగ వచ్చారు
చక్కని చుక్క నడిచే తారను కనగానే
ఎల్లలు దాటి జ్ఞానులు ముగ్గురు వచ్చారు
అన్నన్నా నిజమన్నా
ఈ రాజే మన రాజంటూ
బాలయేసుని గాంచి వారు సంతసించారూ
పరుగున వచ్చి కానుకలిచ్చి
ముక్తిని పొందారు ||ప||
2 వ చరణం..
మనకోసం యిలలో పుట్టిన మరియమ్మ సుతుని
మనసుతో నమ్మికబూని ఆరాధించుదాం
కష్టాలు కడతేర్చు ఇష్టాలు ఈడేర్చు
లోపాలు కడిగేసి పాపాలు మన్నించు
అన్నన్నా రారన్నా రక్షకుడు రారాజు
బాలయేసుని గాంచి
మనమూ సంతసించుదాం
పరుగున వచ్చి కానుకలిచ్చి
ముక్తిని పొందుదాం ||ప||