పల్లవి : ఆరాధన... ఆరాధన.... ఆరాధన..... ఆరాధన
(1) పరలోక మందుండు / పిత దేవుని/ ఉన్నత నామాన
భూమి ఆకాశము నిర్మించిన / దేవాది / దేవునికి
మనుజుల రక్షింప ప్రియ పుత్రుని / జలినిచ్చిన తండ్రికి
పరిపూర్ణ /పరిశుద్ధ/ పరమోన్నతా/ పరమ పవిత్రునికి
అబ్రహం / ఇస్సాకు / యాకోబుల / యావే / దేవునికి
మోషే ఎలియా దావీదులన్, చేపట్టిన ప్రభునికి
ఆరాధన - ఆరాధన ఆరాధన ఆరాధన (2)
(2) దేవుడు / నరునిగా భువి కొచ్చిన / ఇమ్మానుయేలునికి
అంధకార / లోకాన వెలుగై యున్న / ఇస్సామెస్సియునికి
సర్వపాపులకు బలియైనట్టి / ప్రజాపతికి,
పాపుల వెదకి, రక్షించిన / ప్రభు యేసు రాజునికి
వాక్యాని పంపించి సౌఖ్యమిచ్చిన / సౌఖ్యదాతునికి
సత్యము మార్గము జీవమైన త్రియేక / శక్తికి
ఆరాధన - ఆరాధన ఆరాధన ఆరాధన (2)
(3) పాపము త్యజింప / బలపరచిన పరిశుద్ధ ఆత్మునికి
నిత్యము / మనలను / పరిపాలించు/ దేవుని ఆత్మకు
వరములు ప్రోక్షించి, బలపర్చిన / శ్రీయేసు ఆత్మకు
ఫలముతో నింపి /దయ చూపిన / పావన ఆత్మునికి
క్షమనిచ్చి / ప్రేమతో / బలపర్చిన / ప్రేమ స్వరూపికి
లోకపు /మోహన/వేర్పర్చిన / ఆత్మ స్వరూపికి
ఆరాధన - ఆరాధన - ఆరాధన ఆరాధన (2)