Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి : చాలునయ్యా.... చాలునయ్యా
నీ కృపనాకు.... చాలునయ్యా....
ప్రేమామయుడవై ప్రేమించావు
కరుణామయుడవై కరుణించావు
తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి -
ప్రేమ కరుణ నీ కృప చాలు
జిగట ఊబిలో పడియుండగా -
నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా
హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా -
హిమము కంటెను తెల్లగా మార్చయ్యా
నీకేమి చెల్లింతు నా మంచి మెస్సయ్యా-
నా జీవితమంత అర్పింతు నీకయ్యా ||ప్రేమా||
బంధువులు స్నేహితులు త్రోసేసిన
తల్లిదండ్రులే నన్ను వెలివేసినా
నన్ను నీవు విడువనే లేదయ్యా -
మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా
నీకేమి చెల్లింతు మామంచి మెస్సయ్యా -
నీ సాక్షిగా నేను ఇల జీవింతునయ్యా ||ప్రేమ||