Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: సంగమం
చిలకరించు యేసయ్యా నీదు రక్తము
కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలన్
ఎచ్చటికి వెళ్ళిన మాకు విజయమే
నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక
అల్లే అల్లేలూయ అల్లేలూయా
యేసయ్యా - యేసయ్యా
1. పాపులము మేమయ్యా కనికరించుమా
నీదు రక్తంతో మమ్ము శుద్ది చేయుమా ||2||
సైతాను తంత్రములను జయించుటకు ,
చిలకరించు మాపై నీదు దివ్యరక్తము ||2|| ||అల్లే||
2. రోగులము మేమయ్యా కనికరించుమా
నీదు హస్తంతో మమ్ము శుద్ది చేయుమా ||2||
సైతాను తంత్రములను జయించుటకు
చిలకరించు మాపై నీదు దివ్యరక్తము ||2|| ||అల్లే||