Type Here to Get Search Results !

ఏ దారిలేని ఈ దీనజనులకు ( e dharileni e dhinajanulaku Song Lyrics | Telugu Christian Songs Lyrics )

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఏ దారిలేని ఈ దీనజనులకు

పరలోక దారిచూప ఏతెంచినావా దేవా

మాపాలి దేవుడవయ్యా యేసయ్యా లాలి


1 వ చరణం.. 

పక్షులకూ గూళ్ళున్నవి

నక్కలకూ బొరియాలున్నవి

దైవకుమారుడ నీకు తలదాల్చ నీడేలేదు

నీ మహిమ తెలియని మూఢజనులము మేము

క్షమియించి అక్కునచేర్చి పాలింప రావా దేవా

మా పాలిదేవుడవయ్యా యేసయ్యా లాలి


2 వ చరణం.. 

నీ తల్లిదండ్రులమాట నీకు వరాలమూట

ముప్పది మూడేళ్ళ కాలం జవదాటక నీవు

ఇలలో మా జీవిత నౌకకు చుక్కానివై

బంగారు భవితకు నీవు నాందివయ్యా

పాలింపరావా దేవా 

మా పాలి దేవుడవయ్యా యేసయ్యా లాలి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section