Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. ఏ పాపమెరుగని-ఓ పావన మూర్తి
పాపవిమోచకుండ
నా పాలి దైవమా నా పాపముల
కొరకీపాటు లొందినావా
1. ముళ్ళతో కిరీట మల్లి నీ శిరముపై
జల్లాటమున మొత్తిరా
ముళ్లపోట్లకు శిరము తల్లడిల్లగ
సొమ్మసిల్లి పోతివ రక్షకా ||ఏ||
2. కలువరి గిరిదనుక-సిలువ మోయలేక
కలవరము నొందినావా
సిలువ నీతో మోయ తులువలు
వేరొకని తోడుగా నిచ్చినారా ||ఏ||
3. చెడుగు యూదులు బెట్టు
పడరాని పాట్లకు
నుడివడి నడచినావా
కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను
గ్రక్కున దించినావా ||ఏ||
4. ఆకాల కర్ములు భీకరంబగు నిన్ను
ఆ కొయ్యపై నుంచినారా
నీకాలు సేతులు ఆ కొయ్యకే సూది
మేకులతో గ్రుచ్చినారా ||ఏ||
5. పలు విధంబుల శ్రమలు చెలరేగ దండ్రి
వెలుగెత్తి మొఱలిడితివా -
సిలువపై పలుమారు కలుగు చుండెడి బాధ
వలన దాహము నాయనా ||ఏ||
6. బల్లిదుండగు బంటు బల్లెమున
నీ ప్రక్క జిల్లిబడ బొడిచినాడా
ఉల్లోలముల వలె నల్ల నీరుబుకంగ
జల్లారెగద కోపము ||ఏ||
7. కటకటా పాప సంకటము బాపుట
కింత పటుబాధ నొందినావా
ఎటువంటిదీ ప్రేమ యెటువంటిదీ
శాంత మెటుల వర్ణింతు స్వామి ||ఏ||