Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఏదో పులకింత నా హృదిని తాకినంత
పరమువీడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరినంత
నాలో వెలుగునింపినంత ||2|| ||ఏదో పులకింత||
1. గోధుమ అప్పం, ప్రభుని తనువుగా, మారిన ఈ వేళ ||2||
జీవాహారం, ప్రేమాహారం, నాకు పంచువేళ ||2||
నాలో ఆనందపు హేళ ||ఏదో పులకింత||
2. ద్రాక్షా రసమే ప్రభురుధిరంగా మారిన ఈ వేళ ||2||
మహిమానిత్వమై అమృతరసమై అందే శుభవేళ ||2||
నేనే పరవశించువేళ ||ఏదో పులకింత||
3. ప్రభుని భోజ్యమే దివ్యవరముగ ప్రాప్తించేవేళ ||2||
ఆత్మ బలముకై అభిషిక్తులు నాకందించే వేళ ||2||
నేనే స్వీకరించు వేళ ||ఏదో పులకింత||