Type Here to Get Search Results !

ఈ పరిణయ శుభవేళ ( ee parinayam shubhavela Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

 

Jesus Songs in Telugu Lyrics
Jesus Songs in Telugu Lyrics

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఈ పరిణయ శుభవేళ స్వాగతం 

నవవరుడా-స్వాగతం ||2|| 

సంధించనూ-నీ సతిన్-అందుకొనుమ

స్వాగతం ||2|| 


1. దివ్యమైన స్నేహబంధం అలరించగా 

నవ్యమైన ప్రేమగీతం పలికించగా 

మరువక తండ్రిమాట మదినుంచగా 

వరుడగు క్రీస్తు బాట పయనించగా 

మరుమల్లెలు పలికాయి-స్వాగతం ||2|| 

కలగాలని దీవెనలు-స్వాగతం ||2|| 

ఈ పరిణయ శుభవేళ స్వాగతం 

నవ వధువా-స్వాగతం ||2|| 

సందించనూ-నీ పతిన్-అందుకొనుమ

స్వాగతం ||2||


2. కారు మబ్బు ఇంటిలోన మణిదీపమై

మేలు చేసి తృప్తినొందు గుణశీలియై 

భర్తకు విలువనిచ్చు వినయమూర్తియై 

కర్తకు మహిమతెచ్చు సిలువ శక్తియై 

విరజాజులు పలికాయి స్వాగతం ||2|| 

వెలగాలని ఈ ధరలో స్వాగతం ||2||

||ఈ పరిణయ|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section