Type Here to Get Search Results !

ఈ ఘడియ కోసమె ( ee ghadiya kosame Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

 

Jesus Songs in Telugu Lyrics
Jesus Songs in Telugu Lyrics

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఈ ఘడియ కోసమే - జగతి వేచింది 

ఈ ఘనుడి కోసమే - జనులు చూచింది 

నీ మహిమ కీర్తనం - దూతలు పాడింది 

నీ ముంగిట ప్రణమిల్లి - జ్ఞానులు వేడింది 

ఇది క్రిస్‌మస్‌ గీతం - క్రీస్తు రాకకు సంకేతం ll 2 ll 


Happy Christmas - Merry Christmas ll 2 ll 


1 వ చరణం.. 

ఆ నింగి నీకు సింహాసనమైన - 

ఈ నేల నీకు పాద పీఠమైనా 

నీ జననం ఓ పేదవాకిటనే-

నీ గమనం నిరుపేద గుండెలోనే llఇదిll 


2 వ చరణం.. 

కొమ్మలూ రెమ్మలు - జోల పాడాయి 

పశువులూ పక్షులూ - తలలూచి వేడాయి 

నిను కన్న ఆ కన్నె - పొత్తిళ్ళు నిండాయి 

నిను గన్న మనుజులు - కన్నులు పండాయి llఇదిll 


3 వ చరణం.. 

అలలపై నడిచిన - ఈ చిన్ని పాదం 

మా తలల తాకిన - మాకెంతో ఆనందం 

గాలినే గద్దించు - నీదైవ వాక్కు 

మా గాయాల బ్రతుకులకు - నిత్య ఓదార్పు llఇదిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section