Type Here to Get Search Results !

ఈ రొట్టె విరిగింది ( ee rote virigindhi Song Lyrics in Telugu | Telugu Christian song lyrics )

Jesus Songs in Telugu Lyrics
Jesus Songs in Telugu Lyrics

 Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ఈ రొట్టె విరిగింది మనకు జీవము నిచ్చింది

ఈ రక్తం పారింది సజీవ జలమై సాగింది

ఈ దేహం నలిగింది మన పాపం కడిగింది

ఈ రుధిరం కారింది సకలలోకం బ్రతికింది

ఓ దేవా మా దేవా మమ్మందుకా వీడలేదు

ఓ దేవా మా దేవా ఈ విందుకా బలిjైునావు llఈ రొట్టెll 


1 వ చరణం.. 

ఈ రొట్టెను భుజియించి నా ఆకలి తీరింది

అది నీ శరీరమే కనుక నా ఆత్మ కోరింది

నీ వస్త్రం అంచు తాకి ఓ రోగి నయమయింది

నీ జీవాహారముతో ఈ జగతే మారిపోయింది

ఓ దేవా మా దేవా మమ్మందుకా వీడలేదు

ఓ దేవా మా దేవా ఈ విందుకా బలియైనావు llఈ రొట్టెll 


2 వ చరణం.. 

ఈ నీటిని పానం చేసి ఈబీడు పగిలింది

అది నీ రక్తమే కనుక ఈ మోడు చిగురించింది

నీ దేహమే మా ఆహారం నీ రక్తమే జీవజలము

ఇది నిజమే యేసయ్యా నీ నిత్యాహారం నీవేనయ

ఓ దేవా మా దేవా మమ్మందుకా వీడలేదు

ఓ దేవా మా దేవా ఈ విందుకా బలియైనావు llఈ రొట్టెll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section