Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఎగిరే పావురమా తెలుపుమా ఎద ఎదకు యేసుక్రీస్తు నామం
కదిలే నదీ జలమా చాటుమా
కరుణామయుని కమనీయ కావ్యం - కమనీయ కావ్యం
1. ఆకాశ మండలమా ఆలకించుమా -
భూదిగంతమా చెవి యొగ్గి వినుమా
యుగ యుగముల దేవుడు క్రీస్తేనువేనని -
జగ జగముల దేవుడు యేసుక్రీస్తువేనని
2. నక్షత్ర మండలమా నలుదిశలకు చాటుమా -
నజరేయుడేసుని సృజనాత్మక చరితం
యుగ యుగముల దేవుడు క్రీస్తేసువేనని -
జగ జగముల దేవుడు యేసు క్రీస్తువేనని