Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
ఎక్కడుంది ఎక్కడుందిరా ఓ అన్నలారా
దైవరాజ్య మెక్కడుందిరా...
దేవుడేలు రాజ్యమంట ` దైవరాజ్యమదేనంట ||2||
తేరిపార చూద్ధమంటే కంటికి కనరాదంట ||2|| llఎక్కడుందిll
1 వ చరణం..
;తిరునాళ్ళకుపోయాను తీర్థాలలో మునిగాను ||2||
గుళ్ళు గోపురాలు చుట్టి మొక్కులెన్నో మొక్కాను ||2|| llఎక్కడుందిll
2 వ చరణం..
పూజలెన్నో చేశాను పునీతులను వేడాను ||2||
కూటాలకు పోయి
మంచి మాటలెన్నో విన్నాను ।2ll llఎక్కడుందిll
3 వ చరణం..
పుట్టు క్రైస్తవున్ని నేను ` బప్తిస్మం పొందాను ||2||
శ్రీసభ గీచిన గీటు ` దాటెరగని వాన్ని నేను ||2|| llఎక్కడుందిll
4 వ చరణం..
బైబులంత చదివాను ` పట్టాలను పొందాను ||2||
తత్త్వవేద శాస్త్రాను అవపోషనపట్టాను ||2|| llఎక్కడుందిll