Lyrics: Rev. Fr. Alexander
Tune/Music: Koka Joseph Ranjith
Album: పరిశుద్ధుడు
ప: ఎలా మరిచిపోయాను నా యేసుని ||2||
ఇలా మిగిలిపోయాను నే పాపినై ||2|| ||ఎ||
ఆ...ఆ...ఆ...ఆ...
1. నా కోసం కల్వరిలో రక్తాన్ని చిందించి
నా పాప భారమునే సిలువగా మోసినా||2||
తన రక్త ధారలనే రక్షణగ చేసి
పాప క్షమాపణనిచ్చే పావన ప్రభుని ||ఎ||
2. ఇన్నాళ్ళు లోబడని నా కొరకు
నా ప్రభువు దినమంతా చేయి చాచి
ఎదురు చూచినాడు ||2||
దుడుకు వాడినై దు:ఖపడిన నాకు
కన్నీటిని తుడిచి కనికరించు ప్రభుని ||2||
ఆ...ఆ...ఆ...ఆ... ||ఎ||